పుస్తక పరిచయం-37

ప్రసిద్ధ జపనీయ కళావిమర్శకుడు, సౌందర్య తత్త్వవేత్త ఒకాకురో కకుజో (1863-1913) రాసిన The Book of Tea (1906) ని 2022 లో తెలుగులోకి అనువదించాను. దాన్ని అనల్ప పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ రోజు ఆ పుస్తకం గురించీ, ఆ పుస్తకం ద్వారా కకుజో పరిచయం చేసిన జపనీయ సౌందర్య దర్శనం గురించీ ప్రసంగించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు

హోల్డర్లిను-6

సుప్రసిద్ధ జర్మను రొమాంటిక్ కవి హోల్డర్లిను కవిత్వాన్ని పరిచయం చేస్తూ గతంలో అయిదు పోస్టులు పెట్టాను. మధ్యలో ఆరునెలల విరామం. కానీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు, నేనూ నా మనసులో ఆ కవిత్వాని వదిలిపెట్టలేదు.

నాలుగు పుస్తకాలు

పుస్తకాలు ముద్రిస్తామని చెప్పి వారం తిరక్కుండానే ఈ రోజు నాలుగు పుస్తకాలూ నా ఇంటికి చేరాయి. చాలా అందంగా ముద్రించారు. ధర కూడా మరీ ఎక్కువ పెట్టారనిపించలేదు. ఆసక్తి ఉన్న మిత్రులు వెంకటనారాయణగారిని సంప్రదించవచ్చు.

Exit mobile version
%%footer%%