చిన్న సంభాషణనే. మాటల మధ్యలో నన్నెచోడుడి గురించి మాట్లాడిన మాటల్ని ఇలా చిన్న బిట్టుగా అందిస్తున్నారు స్వాధ్యాయ ఛానెలు వారు. మూడున్నర నిమిషాలు. వింటారని ఇక్కడ అందిస్తున్నాను. ఇది విన్నాక, నన్నెచోడుడి ఊరు వెళ్ళినప్పుడు నేను పంచుకున్న విపులమైన నా అనుభూతిని కింద వ్యాసంలో చదవొచ్చు.
సంభాషణలు-4
కస్తూరి మురళీకృష్ణగారు, కోవెల సంతోషకుమారుగార్లతో చేసిన సంభాషణల వరసలో ఇది నాలుగవది. ఇందులో ప్రధానంగా నా కథల గురించీ, కథానికా ప్రక్రియగురించీ మాట్లాడించేరు. దాదాపు గంటన్నర సంభాషణ. మీ వీలుని బట్టి వినగలరు.
