మహాకవి దాశరథి కృష్ణమాచార్య కవిత్వం పైన 2007 లో మోహనరాగం సిరీసు లో చేసిన ప్రసంగం. ఇప్పుడు దాశరథి శతజయంతి సందర్భంగా మరోమారు మిత్రుల్తో పంచుకుంటున్నాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.
పుస్తక పరిచయం-27
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా కాళిదాసు మేఘసందేశం మీద ఆరవ ప్రసంగం. ఈ రోజు పూర్వమేఘంలోని 33-39 శ్లోకాల దాకా చర్చించాను. కవి మేఘాన్ని ఉజ్జయినిలో తిరిగి చూడమన్న దృశ్యాల గురించి సంతోషంగా తలుచుకున్నాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
మసిబారిన బుద్ధుడు
సుబ్బారావుగారి వాక్యంలో ఒక వింత సొగసు ఉంటుంది. అది అచ్చు ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. సూటిగా, తేటగా, నిరలంకారంగా, కానీ ఎంతో సానునయంగా, ప్రేమగా. మనకు తెలిసిన కథలే, కాని ఆయన వాక్యాల్లో చదివినప్పుడు, మళ్ళా కొత్తగా కనిపిస్తాయి. ఈ జెన్ కథలు చదువుతున్నప్పుడు కూడా అదే అనుభూతి నాకు.
