
ప్రశాంతి చోప్రా గారు గొప్ప గాయిక. మిత్రులు సురేశ్ కొలిచాల గారి గీతాల్ని, అనువాదాల్ని ఆమె స్వరపరిచి, గానం చేసిన వీడియోలు గతంలో చూసాను. ఆమె కంఠస్వరం, ఆ స్వరంలోని మార్దవం, శుభ్ర సంస్కారం, గీతంలోని సాహిత్యం పట్ల ఆమె చూపించే గౌరవం నన్ను చాలా ఆకట్టుకున్నాయి.
మొన్న నేను నా గేయం ‘ఎర్రపూల చెట్టు’ని ఎవరూ స్వరపరిచి గానం చెయ్యడం లేదు కాబట్టి నేనే ఏ.ఐ సహాయంతో ట్యూను చేసుకున్నానని పెట్టిన వీడియో ఆమె చూసారు. అపారమైన సహృదయతతో ఆమె ఆ గేయాన్ని తానిట్లా స్వరపరిచి పాడి నాకు పంపించారు. ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆశీస్సులు కూడా.
సురేశ్ కొలిచాల గారికి కూడా మరిన్ని మేలు తలపులు.
ఎర్రపూల చెట్టు
ఎర్రపూల చెట్టు
ఆ
ఎర్రపూల చెట్టు!
చిన్ననాటినుండి
న
న్నంటిపెట్టుకున్న
ఎర్రపూల చెట్టు
ఓ
ఎర్రపూల చెట్టు!
మండుటెండవేళ
నా
గుండె చీల్చుచుండు
ఎర్రపూల చెట్టు
ఈ
ఎర్రపూల చెట్టు!
ఒకరి గుండె చీల్చి
వే
రొకరి మనసుకతుకు
ఎర్రపూల చెట్టు
నా
ఎర్రపూల చెట్టు!
19-5-2025
పద లాలిత్యం అద్భుతం…సర్
ధన్యవాదాలు సార్!