ప్రాచీన కాలం నుంచి సామాన్యశకం ఆరవశతాబ్దిదాకా చీనా కవిత్వాన్ని పరిచయం చేస్తూ 22 వ్యాసాలు, 111 కవితల అనువాదాలు వెలువరించాను. ప్రాచీన చీనా కవిత్వం గురించిన ఇంత సమగ్ర పరిచయం తెలుగులో రావడం ఇదే ప్రథమం.
పుస్తక పరిచయం-16
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది ఆరవది. ఈ రోజు టాగోర్ కవిత్వ సంపుటి 'బలాక' (1914) పైన ప్రసంగించాను.
చలంగారూ, జగ్గారావూ
కానీ మొన్న ఒక పుస్తకావిష్కరణ సభకి పిలిస్తే ఇదే చెప్పాను: మీరు నిజంగా మీ హృదయం ఏమి చెప్తోందో దాన్నే రాయదలుచుకుంటే, మీకు ఒక్క పబ్లిషరు కూడా దొరక్కూడదు, ఒక్క పాఠకుడు కూడా మీకు తన స్పందన చెప్పకూడదు అని. ఎందుకంటే పబ్లిషరు అంటూ ఒకడు దొరగ్గానే మీ రచన ఒక పెట్టుబడివస్తువుగా మారిపోతుంది.
