పుస్తక పరిచయ ప్రసంగాల్లో భాగంగా ఈ సాయంకాలం టాగోర్ కవిత్వం మీద ప్రసంగించాను. ప్రసంగం మొత్తం ఇక్కడ యూట్యూబులో వినవచ్చు.
తూలిక
గత పదిపన్నెండేళ్ళుగా చిత్రకారుల్నీ, శిల్పుల్నీ, వివిధ చిత్రకళారీతుల్నీ అర్థం చేసుకోడంలో నాకు కలుగుతూ వస్తున్న ఆలోచనల్ని ఫేస్‌బుక్ ద్వారానూ, నా బ్లాగు ద్వారానూ మిత్రుల్తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చాను. అలా పంచుకున్న 58 వ్యాసాల సంపుటి ఈ పుస్తకం 'తూలిక'. ఈ రంగుల పండగ సందర్బంగా దీన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది నా 58 వ పుస్తకం. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో పంచుకోవచ్చు.
హోల్డర్లిన్-1
ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయనకి ఇరవై ఎనిమిదేళ్ళు. కాని అతడికి తెలీదు, భారతీయ భక్తి కవులు దేశభాషల్లో కవిత్వం చెప్తున్నప్పుడు, ఒక కబీరు, ఒక బుల్లేష, ఒక తుకారాం చేసిందిదే అని. తనకి తెలీకుండానే భారతీయ భక్తికవులకి హోల్డర్లిన్ చాలా సన్నిహితంగా రాగలిగేడు.
