పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా 21-2-2025 న బైరాగి రాసిన కవిత అర్జున విషాదయోగం మీద ప్రసంగించాను. ఈ ప్రసంగంలో ముందు భగవద్గీత గురించి స్థూలంగా పరిచయం చేసి, అర్జునుడి పాత్ర ద్వారా కర్మక్షేత్రం మధ్యలో సంశయగ్రస్తుడయ్యే మానవుడి విచికిత్స గురించి బైరాగి ఏమని చెప్తున్నాడో వివరించాను.
అంటున్నాడు తుకా -6
సాధుసంతులు వదిలిపెట్టిన ఎంగిలి నా మాటలు పల్లెటూరి బైతుని, సొంతంగా ఏం చెప్పగలను ?
ప్రతిరోజూ పండగే
అదే వీథి, అడ్డదిడ్డంగా అవే కరెంటుతీగలు అదే దుమ్ము, అవే బిల్డింగులు అదే మార్కెటు, అవే హారన్లు వాటిమధ్య అకస్మాత్తుగా ఆకుపచ్చని ఫౌంటెను తెరిచినట్టు మా ఇంటిముందు కానుగచెట్టు.
