
14
సాధుసంతులు వదిలిపెట్టిన ఎంగిలి నా మాటలు
పల్లెటూరి బైతుని, సొంతంగా ఏం చెప్పగలను ?
విట్టలుడి నామమే శుద్ధంగా పలకలేను
ఆ నామరహస్యం నాకెలా తెలుస్తుంది?
పసిబిడ్డలాగా తొక్కుపలుకులు పలుకుతాను
అందుకు కోపమొస్తుందా, కోపించు.
నేను పుట్టిందే కులమో మర్చిపోయావా?
ఈ విషయంలో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను.
తుకా అంటున్నాడు, దేవుడే నాతో పలికిస్తున్నాడు
నా మాటల్లో అంతరార్థమేదో ఆయనకే తెలుసు.
संतांचीं उच्छिष्टें बोलतों उत्तरें । काय म्यां गव्हारें जाणावें हें ॥१॥
विठ्ठलाचे नाम घेता नये शुद्ध । तेथें मज बोध काय कळे ॥ध्रु.॥
करितो कवित्व बोबडा उत्तरी । झणी मजवरी कोप धरा ॥२॥
काय माझी याति नेणां हा विचार । काय मी तें फार बोलों नेणें ॥३॥
तुका म्हणे मज बोलवितो देव । अर्थ गुह्य भाव तोचि जाणे ॥४॥ (919)
15
భక్తుడే లేకపోతే దేవుడే
రూపంలో సేవలు స్వీకరిస్తాడు?
వజ్రానికి బంగారంలాగా
ఒకరి శోభ మరొకరు.
దేవుడే లేకపోతే భక్తుడు
కోరికలెలా వదులుకోగలడు?
తుకా అంటున్నాడు: తల్లీబిడ్డల్లాగా
ఒకరు లేక మరొకరు లేరు.
भक्ताविण देवा । कैंचें रूप घडे सेवा ॥१॥
शोभविलें येर येरां । सोनें एके ठायीं हिरा ॥ध्रु.॥
देवाविण भक्ता । कोण देता निष्कामता ॥२॥
तुका म्हणे बाळ । माता जैसें स्नेहजाळ ॥३॥ (102)
16
మాట్లాడకుండానే మాట్లాడతాను
మరణించీ జీవిస్తాను
జనులమధ్య ఉండకుండానే ఉంటాను
వదిలిపెట్టీ అనుభవిస్తాను
కలిసిఉంటూనే కలిసిఉండను
బంధాలూ, తోవలూ రెండూ వదిలేసాను
తుకా అంటున్నాడు కనిపించేది నేను కాదు
అయినా నేనెవరంటే, పాండురంగణ్ణే అడగండి.
बोलों अबोलणें मरोनियां जिणें ।
असोनि नसणें जने आम्हां ॥१॥
भोगीं त्याग जाला संगींच असंग ।
तोडियेले लाग माग दोन्ही ॥२॥
तुका म्हणे नव्हें दिसतों मी तैसा ।
पुसणें तें पुसा पांडुरंगा ॥३॥ (537)
21-2-2025

