అవధూత గీత-15

నా చిత్తం మొత్తం ఏకాగ్రంగా ఉందని తెలుసుకో లక్ష్యమూ, విలక్ష్యమూ అనేవి లేనివాణ్ణని తెలుసుకో కాబట్టి యోగవియోగాల గురించి నేనేమి చెప్పేది? నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.

అవధూత గీత-14

అది శూన్యరూపం కాదు, అశూన్య రూపమూ కాదు అది శుద్ధరూపమూకాదు, విశుద్ధరూపమూ కాదు నిజానికి అది రూపమూ, విరూపమూ కానే కాదు పరమార్థ తత్త్వానిది తనదైన సహజ స్వరూపం.

అవధూత గీత-13

ఆ విమలసత్యాన్ని ఇదనిగాని, ఇదికాదని గాని ఎలా చెప్పను ఆ నిర్మలసత్యాన్ని శేషమనిగాని, నిశ్శేషమనిగాని ఎలా చెప్పను ఆ తేటవెలుగును గుణమనిగాని, గుణరహితమనిగాని ఎలా చెప్పను నశింపులేని ఎరుకను, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి

Exit mobile version
%%footer%%