
వివేక్ పుస్తకం లంకమల దారుల్లో ఆవిష్కరణ సభలో చేసిన ప్రసంగం. ఆ పుస్తకానికి రాసిన ముందుమాటని ఇక్కడ ఇంతకుముందే పంచుకున్నాను. ఈ ప్రసంగంలో శివ రాచర్ల గురించి కూడా నాలుగు మాటలు చెప్పాను. ముఖ్యంగా తెలుగులో political fiction రావలసిన అవసరం గురించి.
రాజ్యం, రాజ్యహింస, రాజకీయ పోరాటాల గురించి తెలుగు సాహిత్యం మాట్లాడినంత బిగ్గరగా మరే భాషా సాహిత్యం కూడా మాట్లాడి ఉండదంటే అతిశయోక్తి కాదేమో! కాని రాజ్యం గురించీ, రాజకీయ వ్యవస్థల పనితీరు గురించీ, రాజకీయనాయకుల ప్రయాణాల గురించీ, రాజకీయశక్తుల పనిని ప్రభావితం చేసే అంతర్గత తర్కం గురించీ తెలుగు సాహిత్యకారుడి అవగాహన చాలా పరిమితమైంది. ఆ పరిమితులే సినిమాల్లో కూడా కనిపిస్తాయి, అవే పరిమితులు మన పత్రికారచనలో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక ఎలెక్షన్ ఎలా జరుగుతుందో, ఆ లోపలి, బయటి వ్యవస్థని కనీసంగా కూడా చిత్రించిన ఒక నవల ఏదీ తెలుగులో నేనిప్పటిదాకా చదవలేదు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి లేదా ఒక డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఒక ఛీఫ్ సెక్రెటరీ, ఒక కలెక్టరు, ఒక తహశీల్దారు, గ్రామసర్పంచి, ఒక కంట్రాక్టరు, ఒక రాజకీయ పక్షానికి కొమ్ముకాచే పత్రిక సంపాదకుడు- వీళ్ళందరి జీవితాల్లో ఎంతో నాటకీయత ఉంటుంది. వీరిలో ప్రతి ఒక్కరూ చావో బతుకో తేల్చుకోవాల్సినటువంటి కఠినాతి కఠినమైన సంక్షోభాలు ఎన్నో ఎదుర్కొంటూనే ఉంటారు. అటువంటి సంక్షోభమయ సన్నివేశాల చుట్టూ అల్లిన ఒక్క నాటకం కూడా నాకిప్పటిదాకా కంటపడలేదు. కారణం మన రచయితల అనుభవాలు రాజ్యవ్యవస్థల అంచుల్లో సంచరించేవే తప్ప, నరసింహారావుగారు రాసినట్టుగా insider అనుభవాలు కావు.
కాబట్టి తెలుగులో political fiction నిశితంగానూ, నమ్మదగ్గదిగానూ రావాలంటే, శివ రాచర్ల లాంటి పరిజ్ఞానులు మనకి విస్తారంగా అవసరం. ఆ మాటలే ఈ ప్రసంగంలో నేను అదనంగా చెప్పిన మాటలు.
22-2-2024
మీ ప్రసంగాన్ని నిన్న నే టివి లొ కాస్ట్ చేసుకుని విన్నాను. శివ రాచర్ల గారి పరిచయం బాగుంది.
ధన్యవాదాలు మేడం
అరటి పండు ఒలిచి చేతిలో పెడుతున్నారు! జ్ఞాన దాతా సుఖీభవ!
ధన్యవాదాలు సార్
ఏది రాసినా , ఏది చెప్పినా ఏదో కొత్తవిషయం తెలియజేయటం మీ రచనల పట్ల, ప్రసంగాల పట్ల పాఠకులు లేదా శ్రోతలను ఆసక్తుల్ని చేస్తాయి. దానికి మీ అధ్యయనం అనుభవం తోడుగా చేసుకుని మనస్ఫూర్తిగా మర్మరహితంగా వివరించడం నిర్మమంగా నిర్మలంగా చెప్పడం
మీరంటే ఎనలేని అభిమానం కలుగజేస్తుంది.
కొంతమంది మహనీయులను గతంలో నవయుగ వైతాళికులు అని సంబోధించటం ఈ సందర్భంగా గుర్తుకు వచ్చి ఎలాంటి వారిని అలా సంబోధిం చారో మిమ్మల్ని చూసిన తరువాత బోధపడింది.
ప్రసంగం విన్న తరువాత మీ పరోక్షంలో చప్పట్లు కొట్టాలనిపించటం దీనికి కొసమెరుపు. అది అసంకల్పిత ప్రతీకారచర్య.హృదయానికి ఒక విషయం నచ్చిందంటే దానంతటదే చప్పట్లు కొట్టాలనే ఉత్సాహం కలుగుతుంది. మీ ప్రోత్సాహం అందుకునే అర్హత కలిగిఉండటం వివేక్ అదృష్టం.
శివరాచర్ల గారికి అభినందనలు.
ఎంతో ప్రేమపూర్వకంగా, మరి ఎంతో నిర్మల హృదయంతో మీరు రాసిన ఈ వాక్యాలకు మీ ముందు మోకరిల్లుతున్నాను.
వినమ్ర నమస్సులు
రత్నం గా మారాలని వినకున్నా,
మీ మాటలు వింటుంటే రత్నం గా మారతామనే నమ్మకం సార్.
ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్
సవివరంగా కళ్ళకు కట్టినట్లు వివరించారు. మాలాంటి శ్రోతలను ఉత్తేజ పరుస్తున్న మీ అవిరళ కృషికి ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్
స్ఫూర్తిదాయకమైన ప్రసంగం…
ధన్యవాదాలు సార్
సర్ నమస్కారం ,, శివ రాచర్ల నాకు ఆత్మీయ మిత్రుడు, వివేక్ కూడా ,, మీరువాళ్లకు అందించిన ఆశీస్సుల కు ధన్యవాదాలు, శివ మార్కాపూర్ అబ్బాయి
ధన్యవాదాలు సార్