చెట్లు చిగిరించే కాలంలాగా ఈ నగరంలోకి గాలిపటాల ఋతువొచ్చింది.
సుకృతుడు
గంగా, యమునా జలాల మీంచి వీచేగాలుల్తో పాటు, సాయంకాలపు నమాజ్ వినిపించే సంధ్యాకాంతితో పాటు, దేవాలయాల్లో పొద్దుటిపూట అల్లుకునే ఒక మంగళమయసునాదంతో అతడి సంగీతం నిండిపోయి ఉందని తెలియడానికి మనకి హిందుస్తానీ సంగీత పరిజ్ఞానంతో ఏమీ పనిలేదు.
పోయిన ప్రాణం లేచొచ్చినప్పుడు
నిన్ను ప్రేమించే వాళ్ళ చేయూతకోసం ఎలుగెత్తి ఆహ్వానించు. నీకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళకి ఎన్నోరూపాలు: వాళ్ళు జంతువులు కావచ్చు, పంచభూతాలు, పక్షులు, దేవదూతలు, సాధువులు, శిలలు , నీ పితృదేవతలు కావచ్చు.
