మొదటి సర్గల్లో కవితల్లో లేతపసుపు, నారింజ, గులాబీ ఎరుపు, లేతాకుపచ్చ లాంటి రంగుల్ని వాడితే, ఈ కవితల కోసం నలుపు, ధూసరవర్ణం, ముదురు ఇటుకరంగు, బూడిదరంగు, ఎండిపోయి నెర్రెలు విచ్చిన మట్టిరంగుల్ని వెతుక్కున్నాను.
పునర్యానం-25
ఆ రోజుల్ని తలుచుకుంటే ఇవాళ నా కళ్ళముందు కదలాడేది ఆ సంతలూ, ఆ వేడుకలూ, ఆ బాజాలూ, ఆ రంగులూ, ఆ నాట్యాలూ మాత్రమే కాదు, ఆ ఒలిసె పూలూ, ఆ ఇప్పచెట్లూ, ఆ మామిడిపూతా, ఆ గుగ్గిలంచెట్లనీడలూ, ఆ తేనెపెరలూ, ఆ చంద్రవంకలూ, ఆ సూర్యకాంతులూ కూడా.
పునర్యానం-24
కాని ఒకసారి ఆ పోరాటస్ఫూర్తి నీ హృదయంలో ప్రవేశించాక నువ్వు అవేవీ పట్టించుకునే స్థితిలో ఉండవు. నువ్వు నీ ఒక్కడికోసమే బతికే పరిస్థితి ఇంకెంతమాత్రం ఉండదు. నిన్ను నమ్ముకున్నవాళ్ళు కొందరు కనిపించడం మొదలుపెడతారు. ఆ తర్వాత నీ జీవితం నీది కాదు, వాళ్లదవుతుంది.
