
సాధారణంగా మనం పెయింటింగ్స్ కి ఫ్రేములు కట్టించుకుని గోడలకు తగిలించుకుంటాం. కానీ భారతదేశంలో ఒకప్పుడు చిత్రలేఖనాల్ని ఆస్వాదించే పద్ధతి ఇలా ఉండేది కాదని సంజీవ దేవ్ గారు రాశారు. ఆయన రాసిన దాని ప్రకారం చిత్రకారుడు వాటిని ఒక పట్టు వస్త్రంలో దస్త్రంలాగా కట్టిపెట్టుకుని ఉండేవాడట. ( ఆ రోజుల్లో చిత్రలేఖనాలు దాదాపుగా మీనియేచర్స్ అని మనం మర్చిపోకూడదు.) ఆ చిత్రకారుడు తన ఇంటికి ఎవరైనా ఒక అతిథిని ఆహ్వానించిన రోజున ఆ చిత్రలేఖనాలు ఆస్వాదించడానికి కూర్చునేవారట. ఆ చిత్రకారుడు ఆ చిత్రాల్ని తీసి అక్కడ ఒక బల్లమీదనో లేదా ఒక బోర్డు మీదనో ఒక్కొక్కటే పెట్టి చూపించేవాడట. అంటే కవులు తమ కవితా సంపుటి నుంచి ఒక కవిత చదివి వినిపించినట్టు, లేదా గాయకుడు ఒక్కొక్క రాగం ఆలపించినట్టు అన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న వారంతా ఆ చిత్రాన్ని తదేకంగా చూసేవారట. ఆ తర్వాత కొంత సేపు ఆ చిత్రం గురించి మాట్లాడుకునేవారట. అప్పుడు మళ్ళా మరొక చిత్రం. పూర్వకాలపు మీనియేచర్ చిత్రకారులు లేదా బెంగాల్ నీటిరంగుల చిత్రకారులు చిత్రలేఖనాలను చూపించే పద్ధతి ఇది అని సంజీవదేవ్ రాశారు.
మొన్న ఆషాఢమేఘం వ్యాసాలకు నేను గీసిన నీటి రంగుల చిత్రలేఖనాలను మానసకు పంపించినప్పుడు, ఆమె ఒక్కొక్క చిత్రలేఖనాన్ని ఇలా చూపిస్తూ తన స్పందనను తెలియజేస్తూ ఉండింది. అలా నా చిత్రలేఖనాల్ని చూసి ఒక్కొక్క దానిపైన అంత రస హృదయంతో స్పందించిన వారెవరూ కనిపించలేదు. అందుకని ఆమె స్పందనల్నీ, అందుకు నా ప్రతిస్పందనల్నీ ఇలా నలుగురితో పంచుకుందామనిపించింది.
నా ఇరవై ఏళ్లప్పుడు నా ‘శరణార్థి’ కథను, రాజమండ్రిలో శరభయ్య గారు ఇలానే చదివి, ఒక్కొక్క వాక్యాన్నే ఎత్తిచూపుతో, ఇట్లానే తన స్పందన పంచుకున్నారు. ఈసారి అటువంటి స్పందన నా చిత్రలేఖనాలకు లభించింది.
మానస: Holding this in my hands made me very emotional. దేనికదే ఒక అద్భుతం…ప్రతీ రంగూ, బ్లాగులో చూసిన దానికి వెయ్యి రెట్లు అందంగా ఉన్నాయి. మీ సంతకం అదనపు అందం. You made my day.

నేను: సాధారణంగా లాప్టాపుల్లోనూ, మొబైళ్లలోనూ ఎల్సిడి ఉంటుంది కాబట్టి రంగులు బాగా కాంతివంతంగా కనిపిస్తాయి. కాబట్టి ఆ బొమ్మల్ని కాగితం మీద చూసి మీరు డిసప్పాయింట్ అవుతారని అనుకున్నాను. కానీ అవి మీకు నచ్చటం నా భాగ్యం. వాటి మీద పూర్తి హక్కులు మీవే.
మానస: విపరీతంగా నచ్చిన వాటిలో ఇదొకటి…
ఎంత సుకుమారమైన భావన కలిగించిందో..ఆ పరదా పక్కకు జరిగి.. ఓహ్..!

నేను మీ బొమ్మలకు కూడా ఎప్పటి నుండో అభిమానినే కానీ, వీటినిలా చూస్తే వాటి అసలైన అందం తెలుస్తోంది. నిజం. ఫోటోల్లో చూసిన వాటి కన్నా అపురూపంగా ఉన్నాయి. ఆ లేత రంగులు. Shades. అద్భుతం. అద్భుతం.
నేను: When I read in textbooks that you need to be bold with watercolor, I was at difficulty to understand. Now I realised that it expects the artist to be bold, quick and confident. No sketch in this bunch took me more than ten minutes each.
మానస: Unbelievable.
నేను: సాహసి కాని వాడు స్వర్గానికి, జీవన సమరానికి మాత్రమే కాదు నీటి రంగులకు కూడా పనికిరాడు అని ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను.
టాగోర్ ఇటువంటి గదిలోనే కూర్చుని మేఘదూతం మీద గీతం రాసి ఉంటాడు అని అనుకుని ఈ బొమ్మ గీశాను.
మానస: పూర్తిగా వాన నీటిలో తడిపిన బొమ్మ ఇది. ఆ కావి రంగు ఎంత బాగుందంటే…మట్టి వాసన తెలిసేంత…

నేను: The magic is totally accidental. There is a color called Quinacridone Gold. I think it was sheer audacity to use gold for water and yes. It did the magic. And of course I was soaked in Paripadal poems by that time fully.
మానస: ఏదో మాంత్రిక లోకం వైపు తీసుకుపోయిన బొమ్మ ఇది. అటు వైపు లోకానికి లాగేసింది మనసు.

నేను: Yes, after this I told Vijji that the medium has finally blessed me.
మానస: అట్లా ఆ మేఘాల కింద నిలబడి జడివాన చూస్తే ఎలా ఉంటుందో కానీ, మీ బొమ్మలు చూడటం అలానే ఉంది.. This one is brilliant.

నేను: Again, a sketch that made me a readyman, as they say speaking makes a readyman and writing makes an exact man.
మానస: And this! ఏం రంగులు, ఏం అందం, అసలు ఊహకైనా ఆ రంగులు తోచినందుకు, ఆ కవిత్వానికి…నేను కవితలూ బొమ్మలూ పక్క పక్కన ఉంచుకోవాలి.

దీనికి (కింద బొమ్మ) goosebumps వచ్చాయి..కళ్ళల్లో నీళ్ళు కూడా. ఆ సంబరం చెప్పలేను. I wish I could freeze that moment. Very delicate. నాకు దీన్ని దాటి తరువాతి దానికి వెళ్ళాలనే అనిపించలేదు.

అటు తిరిగీ ఇటు తిరిగీ ఇవే మళ్లీ మళ్లీ చూసుకుని భద్రంగా లోపల పెట్టీ, మళ్లీ తీసీ, . You made my day. Truly. Truly…
నేను: మానసా! గొప్ప యూరోపియన్ నీటి రంగుల చిత్రకారులు, ముఖ్యంగా Emil Nolde లాంటివాళ్ళు నీటి రంగులే తమ ప్రపంచంగా బతికారు. ఎప్పటికైనా నేను ఆ స్థితికి చేరగలిగితే అంతకన్నా ఈ జీవితానికి ధన్యత లేదు.
మీరు బీరేశ్వర సేన్ నీటి రంగుల మీనియేచర్లు చూడండి. ఆయన నాకు ఒక కొండ గుర్తు. నెట్లో వెతికితే కనబడతాయి. సంజీవ్ దేవ్ కి ఆ నీటి రంగుల చిత్రాలు అంటే గొప్ప ఆరాధన.
Emil Nolde చిత్రలేఖనాల పేరు మీద ఒక ఫేస్బుక్ పేజీ కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేయవచ్చు.
మానస: Will do it right away. Done, the soul of flowers.
నేను: Yes. That one. Please read about him. నిజమైన కళాకారులు అంటే వాళ్లు. కానీ గొప్ప యూరోపియన్ చిత్రకారులు కూడా మధ్యయుగాల చీనా చిత్రకారులవైపే చూస్తూ ఉంటారు. ఎప్పటికైనా ఒక చీనా చిత్ర కారుడిలాగా ఒక్క తూనీగని చిత్రించ గలిగినా చాలు అనిపిస్తుంది.
మానస: మీరు చేసే మేజిక్ మీకు తెలీదు. అయినా మీరు ఇంకా సాధన చెయ్యడం మా అదృష్టం . అంతే.
ఈ పొదలు…ఇవి ఎంత mystic గా వచ్చాయో. ఆ ఆకాశపు నలుపు ఉండనే ఉంది…

దీనిని ఎంత చూసినా తనివి తీరట్లేదు. ఇంత మంచి లేత గులాబీ ఛాయను రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడు నా బుజ్జాయి గుప్పెట్లో చూసాను.

నేను: Thought it wasn’t complete. So kept aside. Yes. when we are infants, they say our lungs are in pink color. Same is the case with palms and soles.
మానస: మొన్న చెప్పినట్టు ఉన్నాను, ఈ బొమ్మ తూఫాన్ గాలిని గదిలోకి తెచ్చింది. హోరుని పట్టుకున్న బొమ్మ. చూస్తూనే మూడ్ మార్చగలదు. Classic!

ఊటీలో ఎక్కడి నుండో ఓ జలపాతపు హోరు వినపడుతో ఉంటుంది. ఆకాశపు రంగు వల్ల ఊటీ గుర్తొచ్చింది కానీ, అత్తిరపల్లి జలపాతాల అందమిది..

అన్నీ మళ్లీ మళ్లీ చూసుకుంటూ ఉన్నాను, నాకు నా ఇల్లంతా హఠాత్తుగా బోలెడంత అందంగా అయిపోయిన ఫీలింగ్. భద్రంగా దాచుకుంటాను వీటిని.
ఇదసలు ఫెయిరీ టేల్ లోకం. That dash of purple!

నేను: ఈ థ్రెడ్ ఆఫ్ డైలాగ్ ని ఎక్కడో ఒకచోట ఎత్తి రాసుకుంటాను. మీరు అనుమతిస్తే నలుగురితో పంచుకుంటాను. శుభోదయం.
మానస: Very very good morning sir.. sure. With pleasure. రాత్రంతా వర్షం కురిసే మైదానాల్లో ఆడుకున్నాను.
22-7-2023
What a treasure!! Thanks to you sir for painting them and to Manasa garu for understanding the emotion captured in them.
ధన్యవాదాలు మాధవీ!
Just No Words to describe my ecstatic feeling after reading this Spectacular Picturesque Conversation. Great Observations, Expressions and Comments too by Manasa Garu. Thank You Very Much For Sharing this along with the Paintings Again..
ధన్యవాదాలు సార్!
Amazing 🤩 You should exhibit these wonderful paintings in art galleries.
ధన్యవాదాలు
గంధర్వలోకాలలో విహరిస్తున్న భావన!ఆ సంగీతాన్ని పట్టుకున్న మానస!అభినందనలు తెలియచేయటానికి కూడా మాటలుండాలి.
ధన్యవాదాలు
చైనా చిత్రకారుడిలాగా ఒక్క తూనీగ సృష్టిస్తే చాలు. ఇదే వాక్యం మీ నిరంతర విద్యార్థిని చూపుతుందని మీ పుట్టినరోజు శుభాకాంక్షలలో వ్రాసాను అన్నయ్య.నీటిజల్లులను పూలుగా మడిచి,ఆకాశం పులుముకునే రంగులను అద్ది గుచ్చం లా చేసి మా ముందు పెట్టినట్లుగా ఉంది ఈ పోస్ట్.నాకు మాత్రం మొన్న మీరు పడవలో కొందరు పైకి చూస్తూ ఉండేది నచ్చింది.వాళ్ళ మొహాల్లో ఏదో వెలుగు కనిపించింది.ఇలా పైకి చూస్తూనే ఈ ప్రకృతిలో కలిసి సాగండి.ఉన్నత తలాలకు చేరుకుంటారు 💐💐💐💐
ధన్యవాదాలు చెల్లీ
మొదటిసారి మాత్రమే కాదు, ఈ బొమ్మలని ఈ మూడు రోజులుగా ఎప్పుడు తాకినా, ఎన్ని సార్లు తాకినా, ప్రతిసారీ, నలుపురంగు ఆవరించుకున్న ఆకాశం కింద నిలబడి, వర్షం కురిసే విశాలమైన మైదానాల్లో తడుస్తూనే ఉన్నాను. ❤️ This is one one of the most precious and beautiful gifts I have ever received! ❤️❤️ Thank You!
ధన్యవాదాలు
అద్భుతమైన పెయింటింగ్స్ సర్
ధన్యవాదాలు మేడం
ఇదే కదా సర్ ఇద్దరు రస హృదయుల మధ్య సుకుమారమైన సంభాషణ
ధన్యవాదాలు మేడం
Soulful conversation, sir. 💐💐
ధన్యవాదాలు
అద్భుతమైన చిత్రాలు..
సుకుమారమైన భావాలు..
ఆర్ధ్రమైన స్పందనలు..
అపురూపమైన జ్ఞాపకాలు..
🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
ఒకసారి ఒకతను నన్ను మణిద్వీపం గురించి అడిగాడు. నాకంతగా తెలీదు అని చెప్పానప్పుడు.నిజంగా కూడా తెలియదు. కానీ ఇప్పుడడుగితే మాత్రం ఇలా ఉంటుందని చెప్పాలనిపించింది. ఒక్కొక్క చిత్రం ఒక మేఘసందేశ కావ్యమంత సాంద్రం. మీ ఇరువురి సందేశ సంభాషణం అమృతవర్షిణి రాగంలో గానం విన్నట్టుంది మీకు మాతో పంచుకోవాలనిపించడం మా భాగ్యం.
ధన్యవాదాలు సార్
‘సాహసి కాని వాడు … నీటి రంగులకు కూడా పనికిరాడు’ అని ఇప్పుడు పూర్తిగా అర్థమౌతుంది. మీ సంభాషణ చదువుతుంటే ఓ గైడ్ మాటల్లో శిల్పాల సౌందర్యాన్ని చూస్తున్నట్లుంది
ధన్యవాదాలు
Experienced serenity
Thank you Sir
ధన్యవాదాలు
బావా,పెయింటింగ్స్ చాలా బాగున్నాయి.నిజంగా వాటి గొప్పతనం,నువ్వు,మానస గారి సంభాషణల్లో చాలా బాగా తెలిసింది.చాలా సంతోషంగా వుంది
ధన్యవాదాలు బావా!
మానస స్పందన అపురూపంగా వుంది…మట్టి
వాసన అనుభూతి…. గదిలోకి గాలి వెల్లువ…
ధన్యవాదాలు మేడం
Wow…
Thank you
అద్భుతం. మీ చిత్రాలు, వారి స్పందన, మీ వివరణ. అన్నీ. మనసంతా ఉల్లాసభరితమయింది.
ధన్యవాదాలు సార్