కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం వస్తుందని అనగానే డిసెంబరు మధ్యనుంచి సంక్రాంతిదాకా ఏదో నవ్య ఉత్సాహం. సురభిళించే చామతులు, పొలాల్లో విరగబూసే బంతిపూలు, పండిన పంటని ఇంటికి తీసుకొచ్చే రెండెడ్లబళ్ళు, ముగ్గులు, గొబ్బిళ్ళు, మంచుతెరల్లో కునికే పల్లెలు- ఈ లోకం గురించి ప్రతిసారీ ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది. ఈ సారి కూడా మాట్లాడదాం అనుకోగానే, ఈ ప్రసంగం ఉందని గుర్తు చేసాడు ఆదిత్య. ఓహ్! ఇందరు కవులు, ఇన్ని కవితలు. మర్చిపోయాను సుమా అనిపించింది. సంతోషంగా విన్నాను మరోసారి.

మీరు కూడా వినాలని మళ్ళా మీముందుకు తెస్తున్నాను ఈ ప్రసంగాన్ని.

డొన్ లోడ్ చేసుకుని మీ సిస్టం లోనో, మీ మొబైల్లోనో కూడా వినవచ్చు. మార్నింగ్ వాక్ కి వెళ్తూనో, లేదా మరేదన్నా పనిచేసుకుంటూనో కూడా.

https://chinaveerabhadrudu.in/wp-content/uploads/2018/08/new-year.mp3

3-1-2023

2 Replies to “కొత్త సంవత్సరం”

  1. ఈ డిసెంబరు చలి సాయంకాలంలో దారి పొడుగునా ఇళ్ళ ముందర రంగురంగుల దీపాలకాంతిలో మీ ప్రసంగం, అందులో మీరు చదివిన కవితలు వినడం ఎంతో బావుంది.
    మీరు చదివిన కవితలు, వాటిలోని gratitude, prayer, pain, sorrow, compassion, introspection!! 🙏🏽

    “జీవితం నుండీ మనం కోరవలసింది అనుభవాన్ని మాత్రమేనేమో”
    “మిగిలిందల్లా నీలిరంగు జ్ఞాపకం”
    “అనున్మత్త జ్ఞాపకం”
    ఉషోదేవి సూక్తం 🙏🏽🙏🏽🙏🏽
    ప్రతి మాటా మంత్రమే ఈ ప్రసంగంలో.
    🙇🏻‍♀️

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%