నాకు తెలిసి నా జీవితంలో నేను సన్నిహితంగా చూసిన నిజమైన అద్వైతి అంటూ ఉంటే అది రాధాకృష్ణమూర్తిగారే. చివరిదాకా ఆయన్ని వెన్నంటి ఉన్న ఆ పసిపాపల దరహాసమే దానికి సాక్షి.
ఈ ప్రపంచం మంచికే
నేనన్నాను: 'ఎందుకు కాదు? నేనొక నది ఒడ్డున నిల్చున్నాను. కొన్ని క్షణాల ప్రశాంతి పొందాను. దాన్నిప్పుడిలా నలుగురితో పంచుకోలేదా!' అని.
నువ్వెప్పటికీ స్వతంత్రుడివే.
వినయంగా మసలుకోడానికీ, ఇతరులకు సేవచేయడానికీ, భగవంతుణ్ణి అనుసరించడానికీ నువ్వెప్పటికీ స్వతంత్రుడివే.
