సర్వశ్రేష్ఠ మీనియేచర్ చిత్రకారుడు

ఒకసారి నేనాయనతో 'మీరు హిమాలయాల్ని అజరామరం చేసారు' అని అంటే, ఆయన చిరునవ్వి 'లేదు, నువ్వు పొరబడుతున్నావు దేవ్, హిమాలయాలే నన్ను అజరామరం చేసాయి' అన్నాడు.'

వేంగీక్షేత్రం

ఇవి జాతికీ, జాతి స్వాతంత్య్రానికీ సంబంధించిన పద్యాలు కావు. ఒక మనిషి భావనాబలానికీ,అతడి ఉద్వేగప్రాబల్యానికీ సంబంధించిన పద్యాలు. ఒక చెట్టుగాని, ఒక పుట్టగాని, ఒక జెండాగాని, ఒక న్యాయంగాని, ఒక అన్యాయం గాని నీలో ఇటువంటి స్పందన రేకెత్తించగలిగితే చాలు, నువ్వు మనిషిగా పుట్టినందుకు, భాష నేర్చుకున్నందుకు, నీ జన్మ సార్థకం.

రాముడు నడిచిన దారి

కాని రామాయణంలో ఉండే విశిష్టత ఏమిటంటే, వాల్మీకికి పూల గురించి మాత్రమే కాదు, ఏ పూలు ఎప్పుడు పూస్తాయో, ఏ పూలు ఎక్కడ పూస్తాయో కూడా తెలుసు. వసంత శోభని వర్ణించినప్పుడు మాత్రమే కర్ణికార పుష్పాల గురించి వర్ణిస్తాడు.