కవిత చదువుతున్నంతసేపూ మా ఊరూ, మా ఊరినుంచి లోపలకు వెళ్తే చింతతోపులమధ్య మెరిసిపోయే వణకరాయి గ్రామమూ, కొండచరియలమీంచి ఇంటికి మళ్ళే మేకలమందలూ, ఆకాశంతా ఆవరించే బంగారు ధూళి కళ్ళముందు కదులుతున్నాయి.
సంతోషలవలేశం
గొప్ప పనులు జరిగేది మనుషులూ, కొండలూ కలిసినప్పుడు. అది వీథుల్లోపడి ఒకరినొకరు తోసుకుంటే కాదు.
ఆకాశఃపరాయణమ్
ఇంతకీ ఈ పుస్తకం మొక్కలగురించీ, పూలగురించీ, పిట్టలగురించీ కానేకాదని మీరు గ్రహించే ఉంటారు. ఇది ప్రేమగురించి, ఆంతరంగిక ప్రశాంతి గురించి, అనవసరమైన వాటిని మరో ఆలోచనలేకుండా త్యజించగలగడం గురించి, సాదాసీదాగా, సరళంగా జీవించడం గురించి.
