మా కాలనీలో ప్రసన్నాంజనేయస్వామి గుళ్ళో చండీయాగం చేస్తున్నాం, ఏదన్నా మాట్లాడండి అనడిగితే దేవీసప్తశతి మీద కొంతసేపుమాట్లాడేను. ఎప్పుడో ఇరవయ్యేళ్ళకిందట కర్నూల్లో ఉండగా మా మాష్టారు హీరాలాల్ గారు ఆ పుస్తకం మీద వ్యాఖ్యానమొకటినాతో చదివించారు.
అతడు వదులుకున్న పాఠాలు
కందుకూరి రమేష్ బాబు నాకు పదేళ్ళుగా తెలుసు. అతడు రాసిన 'కోళ్ళ మంగారం, మరికొందరు' (2006) తో పాటు మరొక రెండు పుస్తకాలు, 'బాలుడి శిల్పం', 'గణితం అతడి వేళ్ళ మీద సంగీతం', కూడా సమీక్ష చెయ్యమని వసంతలక్ష్మిగారు నాకు పంపిస్తూ అతడి గురించి నాలుగైదు మాటలు కూడా చెప్పారు.
అమేయమైన మెర మెర
'ద:ఖనీ పీఠమంతా బొమ్మలబాయి ' అంటో సిద్ధార్థ తెచ్చిన కొత్త కవితాసంపుటి 'బొమ్మల బాయి' చదువుతుంటే, కవి మాటల్లోనే చెప్పాలంటే 'జీవిలోపల చెయ్యిపెట్టి తిప్పుతున్నట్టు ఒక అమేయమైన మెర మెర '.
