గత పదిపన్నెండేళ్ళుగా నేను తెలుగు కథాసంపుటాలమీదా, నవలలమీదా రాస్తూ వచ్చిన వ్యాసాల్ని కథల సముద్రం పేరుమీద పుస్తకంగా వెలువరించాను. అదే సమయంలో ప్రపంచ కథకులమీదా, నవలలమీదా రాస్తూ వచ్చిన 31 వ్యాసాల్ని ఇప్పుడిలా 'కొత్త యుగం రచయిత్రి' పేరిట ఒక సంపుటిగా వెలువరిస్తున్నాను.
పోస్టు చేసిన ఉత్తరాలు
ఇవి ఉత్తరాల గురించిన ఉత్తరాలు. రెండేళ్ళ కిందట అలాంటి ఉత్తరాలు పదిహేనుదాకా రాసాను. వాటినిప్పుడిలా గుదిగుచ్చి 'పోస్టు చేసిన ఉత్తరాలు' గా ఇలా వెలువరిస్తున్నాను.
ఉదారచరితులు
సాహిత్యం మీద మాత్రమే కాకుండా చరిత్ర, సమాజం, సంస్కృతికి సంబంధించిన అంశాల మీద నేను పాతికేళ్ళుగా రాస్తూ ఉన్నాను. అటువంటి వ్యాసాలతో గతంలో సోమయ్యకు నచ్చిన వ్యాసాలు పేరిట ఒక సంపుటం కూడా వెలువరించాను. అదే క్రమంలో రాస్తూ వచ్చిన మరొక 36 వ్యాసాల్ని ఇలా 'ఉదారచరితులు' పేరిట మీకు అందిస్తున్నాను.
