కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు.
ఆషాఢమేఘం-6
ఒక కావ్యంలోగాని, ఇతిహాసంలోగాని, పురాణంలోగాని వర్ణన కోసమే వర్ణన చేసేవాడు సాధారణ కవి. కాని మహాకవి ఆ వర్ణనని కథలో పొదుగుతాడు. కథాప్రయోజనానికి ఆ వర్ణనని కూడా ఒక ఆలంబనం చేసుకుంటాడు. కిష్కింధా కాండలోని ఈ వర్షర్తు వర్ణన ప్రయోజనం కేవలం నాయకుడి విరహాన్ని చెప్పడం కోసమే అయి ఉంటే ఇది భావుకుల్ని ఇంతగా ఆకర్షించి ఉండేది కాదు.
ఆషాఢమేఘం-5
జీవితకాలం అడవుల్లో బతికినవాడికి మాత్రమే తోచగల అనుభూతి ఇది. వాన పడే మధ్యాహ్నాల్లో అడవుల అందాన్ని చూసి మనతో పంచుకున్న కవి నాకిప్పటిదాకా ప్రపంచ కవిత్వంలో మరొకరు కనబడలేదు. ఒక జూలై మధ్యాహ్నం అడ్డతీగల్లో అడవుల్లో వానపడుతున్నప్పుడు, ఈ శ్లోకమే నాకు పదే పదే గుర్తొస్తూ ఉండింది.
