కృతజ్ఞతా సమర్పణ

ఇప్పుడు నా దృష్టి ప్రజలకు చేరువగా జరగడం మీద ఉంది. ప్రకృతికి మరింత సన్నిహితం కావాలని ఉంది. కథలు, కావ్యాలు, నవలలు, నాటకాలు రాయాలని ఉంది.

అత్యున్నత పౌర పురస్కారం

ఆ రోజు ఆ ప్రాజెక్టు అధికారి నన్ను గొయిపాక పంపకుండా విజయనగరం పంపి ఉంటే, నేను నా ఉద్యోగ జీవితంలో నేను మరేదైనా అయి ఉండేవాణ్ణేమో గాని, పాఠశాల విద్య సంచాలకుణ్ణీ, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుణ్ణీ కాగలిగి ఉండేవాణ్ణి కాను.