నీ పేరు తలపుకి రాగానే గొంతు గద్గదికమైపోవాలి. దీవించు ప్రభూ! మా పొట్టల్లో ప్రేమ ఉప్పొంగిపోవాలి.
అంటున్నాడు తుకా-8
ఆనందపు వెల్లువ ముంచెత్తింది ప్రేమతరంగాలు ఎగిసిపడుతున్నాయి విఠలుడనే తెప్పను కరిచిపట్టుకుంటాను ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరుకుంటాను
అంటున్నాడు తుకా-4
వైకుంఠం వదిలిపెట్టిమరీ వచ్చి ఇటుకమీద నిలబడ్డాడు తిన్నగా. భక్తపుండలీకుణ్ణి కలుసుకోడానికి జగజ్జ్యేష్ఠుడు వచ్చేసాడిక్కడికి.
