ఆ రోజు ఆయన తలపెట్టినట్టుగా రామాయణ మేళా చిత్రకూటంలో జరిగి ఉంటే తర్వాత రోజుల్లో అయోధ్యలో రామాలయం కట్టాలనే ఆ రాజకీయ తహతహకు అధికసంఖ్యాకుల మద్దతు లభించి ఉండేది కాదు కదా. రాముడుండేది రామకథాశ్రవణం జరిగేచోటతప్ప ఒక మసీదు కింద కాదని ప్రజలు సులభంగా గ్రహించి ఉండేవారు కదా.
ఊ తావో జూ
నిష్టుర యథార్థం ముందు కళాకారుడు మనిషిగా ప్రవర్తించవలసిన పద్ధతి ఏమిటని భారతీయ సాహిత్యవేత్తలూ, కళాకారులూ యుగాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. కొందరు,ఈ లోకంలోనే ఈ మనుషుల మధ్యనే తాము కూడా నిలబడి వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవాలనుకున్నారు. మరి కొందరు ఊ తావూ జూలానే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి తిరిగిరాని తీరాలకు చేరాలనుకున్నారు. ఇంకొందరు తమ కళాస్వప్నలోకపు ద్వారం దగ్గరే నిలబడి ఉంటారు, ఇటు వైపు రాలేరు, అలాగని పూర్తిగా అటువెళ్ళిపోరు.