చారిత్రిక అనివార్యతకి అద్దం.

దాదాపు రెండు వందల సంవత్సరాల చారిత్రిక పరిణామాన్ని రెండువందల పేజీలకు కుదించి చెప్పడం, కాని ఆ క్రమంలో, మనకి రచయిత ఏదో చెప్పకుండా వదిలిపెట్టేసాడని అనిపించకపోవడం మామూలు విషయం కాదు. తాను ఏ ఘట్టాల్ని చిత్రిస్తున్నాడో అక్కడ అతి సూక్ష్మ వివరాల్ని కూడా మనకి చెప్తూనే నిడివిమీద నియంత్రణ సాధించడం మామూలు విషయం కాదు.