ఉదాన పాలి

చివరికి, తూరుపు ఎర్రబడ్డాక, భగవానుడు ఆ సమాధి నుండి లేచి, ఆయుష్మంతుడు ఆనందుణ్ణి పలకరిస్తూ 'అలా అయితే ఆనందా, నేనూ ఈ అయిదువందల మంది భిక్షువులూ నిర్మలసమాధిలో కూర్చున్నట్లుగా నీకు అర్థం కాలేదా' అన్నాడు.

గాసిప్ ఉన్నచోట బుద్ధుడుండడు

బుద్ధుడి పేరు చెప్పడం, బుద్ధుడి కొటేషన్లు షేర్ చెయ్యడం ఒక ఫాషన్ గా మారిపోయిన కాలంలో ఆయన మాటల్ని నిజంగా అర్థం చేసుకున్నవాళ్ళూ, నమ్మినవాళ్ళూ ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూనే ఉన్నాను.