కాళిదాసు మేఘసందేశ కావ్యంలో రెండవ సర్గ మీద చేస్తున్న ప్రసంగాలకు కొనసాగింపుగా ఈ రోజు 2:8-18 శ్లోకాల గురించి ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినొచ్చు.
పుస్తక పరిచయం-31
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశంలోని రెండవ సర్గ గురించి ఈ రోజు ప్రసంగించాను. ఈనాటి ప్రసంగంలో ప్రధానంగా ఉత్తరమేఘం విశిష్టత, అది ఏ విధంగా కావ్యాన్ని పూర్వమేఘంతో కొనసాగిస్తున్నదీ, కవి ఉద్దేశిస్తున్న కావ్య వ్యంగ్యం ఏమై ఉండవచ్చు మొదలైన ఆలోచనలు పంచుకున్నాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
పుస్తక పరిచయం-28
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరంలో భాగంగా కాళిదాసు మేఘసందేశం పైన చేసిన ఏడవ ప్రసంగం. ఈ ప్రసంగంలో ప్రధానంగా 'పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః' అనే శ్లోకాన్ని వివరిస్తూ రసధ్వనిని దాటిన కాళిదాసు కవిత్వ లక్షణాల గురించి కొంత వివరంగా చర్చించాను.
