ఈ కవిత్వాన్ని ఏదో ఒక గాటన కట్టి ఉపయోగం లేదు. ఆ 'నువ్వు' ఎవరు అని శోధించీ ప్రయోజనం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇది ప్రేమ కవిత్వం కాదు, ధ్యాన కవిత్వం. ఇది వసుధారాణికి 'తెలిసి', ప్రయత్నపూర్వకంగా రాసిన కవిత్వం కాదు. ఎన్నో జన్మలనుండీ ఆమెని అంటిపెట్టుకుని వస్తున్న ఏ జననాంతర సౌహృదాల కస్తూరిపరిమళమో ఇట్లా ఒక్కసారిగా గుప్పుమంది.
కబీరు-8
'వైరాగ్యంలోంచి మోక్షం నాకవసరం లేదు'. గీతాంజలి లోని ఈ 73 వ కవితనే కదా నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాదాపు నలభయ్యేళ్ళ కిందట, నా జీవితపరమార్థమేమిటనే తలపు లీలగా నాలో తలెత్తిన వేళ, మొదటిసారి గీతాంజలి చదివినప్పుడు, ఈ కవిత దగ్గరే కదా నేనాగిపోయాను.
భావన: రవీంద్రవాణి
ఆకాశవాణి, హైదారాబాదు కేంద్రం వారి సుప్రభాత 'భావన' కోసం రవీంద్రుడి భావుకత మీద వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
