నీలకురింజి

ఆ తిణైల్లో కురింజి ఒక అవస్థ. పన్నెండేళ్ళకొకసారి పూసే నీలకురింజి పేరుమీద ఆ అవస్థకి ఆ పేరు పెట్టారు. అది పర్వతప్రాంతాల్లో ప్రణయచిత్రణ. కురింజి ఋతుపవనకాలంలో పూసే పువ్వయినప్పటికీ, కవిత్వంలో మాత్రం, అది శారద, హేమంతాల ఋతురాగం. ప్రణయసమాగం కావ్యవస్తువు.

రెండు ముల్లై కవితలు

ఇరవయ్యేళ్ళకిందట చైనా కవిత్వాన్ని మొదటిసారి చదివినప్పుడు చాలా ఏళ్ళే నేనో విభ్రాంత లోకంలో గడిపాను. కాని పదిపదిహేనేళ్ళ కిందట మొదటిసారి ఎ.కె.రామానుజన్ 'పొయెమ్స్ అఫ్ లవ్ అండ్ వార్ ' చదివినతరువాత చీనా కవిత్వంకన్నా ప్రాచీన కవిత్వం మన పక్కనే వికసించిందని తెలిసినప్పటినుంచీ ప్రాచీన తమిళ సంగం కవిత్వానికి నేను గాఢాభిమానిగా మారాను.