కలియువ మనె

చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచోడం కంటే ప్రయత్నించి చిన్న దీపాన్నేనా వెలిగించడం మంచిది అనే సూక్తి ఒకటి మనం తరచూ ఉదాహరిస్తూ ఉంటాం. కాని అటువంటి దీపం చిన్నదైనా, దాని కాంతి ఎంత ధారాళంగా ఉండగలదో ఇటువంటి ప్రయత్నాల్నీ, ప్రయోగాల్నీ చూసినప్పుడు మరింత బాగా అర్థమవుతుంది.

కథలు కూడా అంతే అవసరం

నేనూ రచయితనే కాబట్టి, సరిగ్గా, అప్పుడే, ఆ కథకి ఆ చిన్నారి బాలికలు ఏమి మలుపు ఇవ్వబోతున్నారని కుతూహలంగా ముందుకు వంగి ఆసక్తిగా మరు సన్నివేశం కోసం చూపు సారించాను. ఆ పైన చెప్పబోయే వాక్యాల కోసం ఆతృతగా చెవులు రిక్కించాను.