మాటలు కట్టిపెట్టండి

ప్రతి ప్రత్యూషానా నేను వేచి ఉంటూనే ఉన్నాను, వేచిచూస్తూనే ఉన్నాను, ఎందుకంటే నువ్వు సాధారణంగా నన్ను వధించేది సుప్రభాతాన్నే.

భావన: రూమీ

ఇప్పుడు ప్రపంచమంతా ఉదయకాంతిలాగా ఆవరిస్తున్న రూమీ భావసౌందర్యాన్ని వర్ణిస్తూ ఆకాశవాణి, హైదారాబాదు కేంద్రం వారి సుప్రభాత భావన కోసం వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.

చుట్టూ, చెప్పలేనంత ఉల్లాసం

ఒకవైపు రంజాన్ ఉపవాసాలు, మరొకవైపు బోనాలు. పండగ సందడి లో తేలుతున్న నగరంలో స్నేహితుల రోజు. స్నేహమంటే జలాలుద్దీన్ రూమీ, షమ్షుద్దీన్ తబ్రీజీల మధ్య నడిచిన అనుబంధంలాగా ఉండాలి. ఒకరు మరొకరికి దర్పణంలాగా, అంటే ఎదుటివారిలో తను తప్ప మరేమీ కనిపించనంత తాదాత్మ్యం సాధ్యం కావాలి.