ఎవరేనా కవి లేదా రచయిత తన పుస్తకం మీద మాట్లాడమనో లేదా సమీక్ష చెయ్యమనో అడిగిన తొలిరోజుల్లో ఎలాంటి ఆత్మ విశ్వాసం కలిగేదో, ఆయన నన్ను బొమ్మలు వేసిమ్మని అడిగినప్పుడు కూడా అటువంటి ఎక్సైట్ మెంట్ నే కలిగింది.
శీతవేళ
ఫిబ్రవరిలో మహబూబ్ నగర్ లో అడవికి వెళ్ళినప్పటి దృశ్యాల్లో ఒకటి. నిన్న విన్సర్ అండ్ న్యూటన్ రంగులు తెచ్చుకున్నాను. వాటితో ఈ రోజంతా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. అందులో ఇదొకటి.
చెర్రీ పూలు
తేనీటి పుస్తకంకోసం వేసిన చెర్రీ పూల బొమ్మలు. నీటి రంగులు. ఎ 5, 300 జి ఎస్ ఎం కాగితం
