జయభేరి

ఆ కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమి పాడేరో, మాట్లాడేరో నాకేమీ గుర్తు లేదుగానీ, ఆ రాత్రంతా మా మీద ధారాళంగా వర్షించిన వెన్నెల తడి ఇప్పటికీ నా వీపుకి అంటుకునే ఉంది.

వెన్నెల తడి

కాని ఇంట్లో సోఫాలో కూచుని ఆ సినిమా చూస్తున్నంతసేపూ బయట రెండెడ్ల బళ్ళు ఆగిఉన్నాయనీ, ఎడ్లు నెమ్మదిగా ఎండుగడ్డిపోచల్ని నెమరేసుకుంటున్నాయనీ, వాటిమీద మూడవజాము వెన్నెల రాలుతూ ఉందనీ అనిపిస్తూనే ఉంది. సినిమా అయిపోగానే ఆ ఎడ్లబండిమీద తిరిగి ఆ వెన్నెల రాత్రి అడవి దారిన మా ఊరు వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నాను.