మోహన చంద్ర రాత్రి

రాత్రంతా వెన్నెల వాన కురిపించి చంద్రుడు తన పడవని పడమటి వైపు తీసుకుపోతూ ఉన్నాడు. మేమిక్కడ ఉండిపోయామా లేక ఆ పడవలో వెళ్ళిపోయామా? ఉన్నామని చెప్పవచ్చుగాని, ఉండిపోయిన మేమిద్దరం నిన్నటి మనుషులం మాత్రం కాదు.

ఆమె మరొక వెయ్యి పున్నములు చూడాలి

ఆమె ఒక వ్యక్తి కాదు, శక్తి అనేది మామూలుగా ఒక పడికట్టుపదం. కాని మంగాదేవమ్మ ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఒక ఉద్యమం. ఒక స్ఫూర్తి. ఆ శక్తి అందరికీ లభించేది కాదు. ఆ అసామాన్యమైన చైతన్యాన్ని ఆరాధించడం దానికదే ఒక చైతన్యం.

డా.నన్నపనేని మంగాదేవి

2016 సంవత్సరానికి గాను జమ్నలాల్ బజాజ్ పురస్కారం డా.నన్నపనేని మంగాదేవికి గారికి లభించిందని తెలిసినప్పటినుంచీ ఆమె దగ్గరకి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటూనే ఉన్నాను. నిన్నటికి ఆ అవకాశం లభించింది.