ఆయన కృపాదృష్టికి అడ్డులేదు

ఆ మందిరప్రాంగణంలో అడుగుపెట్టగానే చల్లగానూ, సేదతీర్చేదిగానూ అనిపించింది. ఆ మందిరంలో ఆయన మూర్తి ఒక పల్లెటూరి పెద్దమనిషిలాగా మన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మనం చెప్పబోయేది వినటానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది.