శీలా వీర్రాజు

వీర్రాజు గారిని ఆ తర్వాత ఎప్పుడు చూసినా ఆ తొలినాళ్ళ అద్భుత భావన, ఆరాధభావన నన్ను వెన్నాడుతూనే ఉండేవి. ఇరవయ్యేళ్ళ కిందట వాళ్ళింటికి వెళ్ళాను. అది ఇల్లు కాదు, ఒక కళాకృతి. ఒక అపురూప చిత్ర, శిల్ప సంచయశాల. మళ్ళీ అదే ఆశ్చర్యానుభూతి.