నా చంపారన్ యాత్ర-5

బుద్ధుడు నడయాడిన ప్రతి చోటూ మనకేదో చెప్తూనే ఉంటుంది. ఈసారి నాకు అర్థమయింది, బుద్ధుడికీ, వైశాలికీ మధ్య ఉన్న అనుబంధం లాంటిదే మళ్ళా గాంధీజీకి చంపారన్ కీ మధ్య ఏర్పడిందని.

ఏడు ధర్మాలు

ఇక్కడ బుద్ధుడి రాజనైతికత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన సామ్రాజ్యవాదాన్ని అంగీకరించలేకపోయాడనీ, గణతంత్రాల పట్లనే ఆయన హృదయం కొట్టుకుపోయేదనీ మనకి అర్థమవుతుంది. బహుశా, ప్రపంచంలో మరే ప్రవక్త, కవి, రచయిత, రాజకీయనాయకుడు కూడా ఇలా ప్రజాస్వామ్యపరిథిలోనే తనువు చాలించాలని కోరుకున్నవాళ్ళు మరెవరూ కనిపించరు.