కవితలు రాసుకునే బల్ల

యానిస్ రిట్సోస్ (1909-1990) ఇరవయ్యవ శతాబ్ది గ్రీకు కవుల్లోనే కాదు, ఐరోపీయ కవుల్లో కూడా ఎంతో ప్రసిద్ధి పొందిన కవి. శక్తిమంతమైన కవిత్వం రాసిన కవులు రాశిలో ఎక్కువ రాయకపోవడం మనకు తెలిసిందే. కాని రిట్సోస్ ఇందుకు మినహాయింపు.