ఒక కవిత నీ ఇంటి తలుపు తట్టకపోతే

నా హృదయం కూడా లోతైనదే. కాని ప్రతిఫలించవలసిన ఆ ప్రతిబింబం ఏదీ? ఆ పూర్వకాలపు రాకుమారుడిలాగా, నాకు కూడా ఒక కవిత దొరికితే తప్ప, ఇక్కడి నా బస నివాసంగా మారదు.

కొకింషు

ఈ కవితల ఇతివృత్తాలు బహువిధాలు. తొలివసంతకాలంలో ఏరుకున్న పూలు, వేసవికాలపు కోకిలపాట, హేమంతకాలపు ఫలసేకరణ, శీతాకాలపు మంచురాలుతుండే దృశ్యం, కొంగలూ, తాబేళ్ళూ, వేసవివనమూలికలమీద వాలే గోరింకలు, ప్రణయసంకేతాలు, యాత్రీకులు ప్రార్థనలు చేసే పర్వతప్రాంత దేవాలయాలు