తన మతం కబీరని విస్పష్టంగా చెప్పినవాడు. నిజమైన సూఫీ. అవధూత. ఆయన పాదాలదగ్గర ఆ పుస్తకం ఆవిష్కరణ కావటం నా భాగ్యం. ఈ పుస్తకం మా హీరాలాల్ మాష్టారికి అంకితమిచ్చాను.
నిజమైన కబీరు పంథీ
ఇది భక్తికాదు, ప్రార్థనకాదు, జీవిత స్ఫురణ. పొద్దున్నే కొలనులో ఎర్ర తామర రేకులు విచ్చుకున్నంత మృదువుగా మనిషిలో ఆత్మ విప్పారడం. వేపచెట్టు లోపల్నుంచీ విరిగి పైకి తీపిగా పొంగి పూలుగా విచ్చుకోవడం.
సాంధ్యభాష
వజ్రయానాన్ని విమర్శిస్తూ కబీరు రాసిన కవిత ఏదన్నా ఉందా అంటూ భాస్కర్. కె అడిగిన తరువాత, నేను మరికొంత అధ్యయనం చేయవలసి వచ్చింది. చూడగా, చూడగా కబీరు వజ్రయానులకి చాలానే ఋణపడి ఉన్నాడని అర్థమయింది.
