చెట్టును దాటుకుంటూ

జూకంటి జగన్నాథం ముఫ్ఫై ఏళ్ళకు పైగా నా మిత్రుడు. నా మొదటి కవితాసంపుటి నిర్వికల్ప సంగీతానికి వచ్చిన మొదటి మనియార్డరు అతణ్ణుంచే. ఇప్పటిదాకా అచ్చయిన తన ప్రతి కవితా సంపుటీ నాకు పంపిస్తూ ఉన్నాడు, మూడు సమగ్ర సంపుటాలతో సహా.