ఋషీవాలీ పాఠశాల

ఋషీవాలీ విద్యాసంస్థల్తో నా పరిచయం ఇరవయ్యేళ్ళ కిందటిది. యునిసెఫ్ సలహామేరకు పాడేరులోనూ, ఉట్నూరులోనూ ఆనందలహరి కార్యక్రమం అమలు చేసినప్పుడు ఋషీవేలీ రూరల్ స్కూల్ వారు రూపొందించిన కరికులం ని మేం గిరిజన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసాం. ఆ కరికులం కింద రూపొందించిన కృత్యపత్రాల్ని నేరుగా వాడకుండా వాటిని గిరిజన సంస్కృతికీ, గిరిజన సమాజానికీ సన్నిహితంగా ఉండేలా సరిదిద్దుకుని మరీ అమలుచేసాం. 

కాలామ సుత్త

కాలామసుత్త ని 'కేశముత్తియ సుత్త' అని కూడా అంటారు. అది అంగుత్తరనికాయంలో ఉన్న ఒక సంభాషణ. విద్యగురించీ, తెలుసుకోవడం గురించీ, ముఖ్యంగా ఇతరులు చెప్పారన్నదాన్నిబట్టికాక, మనిషి తనకై తాను తెలుసుకోవలసిన అవసరం గురించీ మాట్లాడిన సంభాషణ అది.