జరొస్లావ్ సీఫర్ట్ చెక్ కవి. 1984 లో కవిత్వానికి గాను నోబెల్ పురస్కారం పొందాడు. ఆయన కవిత్వానికి The Poetry of Jaroslav Seifert (1998) పేరిట ఎవాల్డ్ ఓసెర్స్ చేసిన అనువాదంలో కొన్నాళ్ళుగా మునిగితేలుతున్నాను. ప్రతి రాత్రీ నిద్రలోకి జారుకునేముందు ఒకటిరెండు కవితలేనా చదవడం కొత్తసుగంధాల్నీ, పాతప్రణయాల్నీ మరొకసారి చేరదీసుకోవడం లాగా ఉంది.