ఉన్నత విద్యలో కొత్త ప్రయోగాలు

మౌలనా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివెర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక ఓరియెంటేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నాను. దేశవ్యాప్తంగా వివిధ విస్వవిద్యాలయాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చెరర్లు, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల ప్రిన్సిపాళ్ళు సుమారు యాభై మందికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం.

ఇన్నొవేషన్ అసాధ్యం కాదు

గ్లోబలైజేషన్ యుగం మొదలయ్యాక అభివృద్ధికి రెండు వనరులు ప్రధానమని ప్రపంచమంతా గుర్తిస్తున్నారు. ఒకటి information, రెండోది, innovation. ఇన్నొవేషన్ అంటే కొత్త పుంతలు తొక్కడం. కానీ ఇన్నొవేషన్ ప్రైవేటు రంగంలోనూ, వాణిజ్యరంగంలోనూ తలెత్తినంతగా ప్రభుత్వరంగంలో ఇంకా ప్రస్ఫుటం కావడంలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు సహజంగానే గతానుగతికంగానూ, కరడుగట్టిన ఆచారాలతోనూ కూడుకుని పనిచేయడం, ఇన్నొవేషన్ నువెన్నంటే రిస్క్ కూడా ఉన్నందువల్ల, ఆ రిస్క్ ని తలదాల్చడానికి ఎవరూ సిద్ధపడకపోవడం కొంత కారణం.