యుగయుగాల చీనా కవిత-7

యెఫూ గీతాలు చీనా గీతఛందస్సుని కుదిపేసాయి. అప్పటిదాకా ప్రచలితంగా ఉన్న నాలుగు మాత్రల పద్యపాదంలో అయిదుమాత్రల పద్యపాదం వచ్చిచేరింది. మలి హాన్ పాలనా కాలంలో ఇది మరింత వన్నెదిద్దుకుని కొత్త తరహా గీతరచనకు నాంది పలికింది.