గోపీనాథ మొహంతి

చాలా రోజులుగా పుస్తకాల అలమారులో ఉన్న నవల, గోపీనాథ మొహంతి ' దాదీ బూఢా ' (Ancestor, సాహిత్య అకాదెమీ, 1997) బయటకు తీసాను. ఆ అనువాదం ఏకబిగిన చదివించింది.చాలా ఏళ్ళ కిందట, 'అమృత సంతానం' చదివినప్పుడు ఎటువంటి సంతోషం కలిగిందో, అటువంటి సంతోషంలోనే చాలా సేపటిదాకా ఉండిపోయాను.