ఉదయాకాశంలో పేరు పిలిచారు

ఆ ద్రవీకరణసామర్థ్యం టాగోర్ దా, చలంగారిదా, లేక ఇప్పటికే కరిగిపోయిన నా హృదయానిదా చెప్పలేను. కాని, ఇదిగో, ఈ ఫాల్గుణ ప్రభాతాన్న ఏ పుట తెరిచినా నా హృదయాన్ని ఊడబెరికి బయటకు లాక్కున్నట్టే ఉంది.