అన్ కామన్ వెల్త్

ఆస్ట్రేలియన్ కవి లెస్ మర్రీ (జ.1938-) మన సమకాలిక ఇంగ్లీషు కవుల్లో అగ్రశ్రేణికి చెందినవాడే కాక, ఇప్పుడు ప్రపంచంలో కవిత్వవిద్యను సాధనచేస్తూన్న అత్యంత ప్రతిభాశీలురైన కవుల్లో ఒకడు కూడా. ఆస్ట్రేలియన్ కవిత్వంలో భాగంగా అతడి కవిత్వం కామన్ వెల్త్ కవిత్వం అని చెప్పొచ్చుగాని, అతడు చూసిన, చూపించిన సౌందర్యం చాలా uncommon wealth.