ఆకాశఃపరాయణమ్

ఇంతకీ ఈ పుస్తకం మొక్కలగురించీ, పూలగురించీ, పిట్టలగురించీ కానేకాదని మీరు గ్రహించే ఉంటారు. ఇది ప్రేమగురించి, ఆంతరంగిక ప్రశాంతి గురించి, అనవసరమైన వాటిని మరో ఆలోచనలేకుండా త్యజించగలగడం గురించి, సాదాసీదాగా, సరళంగా జీవించడం గురించి.