కావేరి

కావేరి నది పుష్కరాలు మొదలయ్యాయి. కావేరిని వాగ్గేయకారుల నది అన్నాడు అడవి బాపిరాజు. కర్ణాటక, తమిళదేశాలకి ప్రాణం పోసే కావేరిని నేను శ్రీరంగపట్టణం దగ్గర మాత్రమే చూసాను. అసలు చూడవలసింది చోళనాడులో కదా, తిరువయ్యారులో కదా. కాని తలకావేరి నుంచి తంజావూరుదాకా కావేరి ప్రవాహంలో మానసిక యాత్ర చేసే అవకాశాన్నిచ్చినవాడు కున్నకుడి వైద్యనాథన్.