యుగయుగాల చీనా కవిత-9

నాకు లానే చావో జి లో కూడా ఒక కన్ ఫ్యూసియన్ తో పాటు ఒక డావోయిస్టు కూడా ఉన్నాడు. బాధ్యతలకి అతీతమైన ఒక లోకం కోసం ఎంత తపిస్తాడో, బాధ్యతలు నెరవేర్చడానికి కూడా అంతగానూ పరితపిస్తాడు.